Subscribe Us

header ads

రెడ్డిగూడెంలో పోషకాహార మహోత్సవాలు


 రెడ్డిగూడెం;

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవపురం బీసీ అంగన్వాడి సెంటర్ నెంబర్.132, రాఘవాపురం బీసీ అంగన్వాడి సెంటర్ నెంబర్.134 గల అంగన్వాడి కేంద్రంలో 13-09-2024 అనగా శుక్రవారం నాడు పోషకాహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనుము ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను ప్రచారం చేసేందుకు కమ్యూనిటీతో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇనుము ఎక్కువగా లభించే పదార్థాలు రాగులు, అటుకులు, బెల్లం, ఆకుకూరలు తోటకూర, పుదీనా, మొదలైన ఆహార పదార్థాల గురించి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ కే.కుమారి, అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు,లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.