Subscribe Us

header ads

దేవుని ఊరేగింపుల్లో ముందు,అశ్లీల పాటలు,డాన్సులను నియంత్రించాలి

 


 చల్లపల్లి, 

వినాయక నిమజ్జనం ఇతర దేవుడి ఊరేగింపుల్లో మద్యపానం,అశ్లీల నృత్యాలు,పాటల సంస్కృతి లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. చల్లపల్లి వైశ్య బజార్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం పూజా కార్యక్రమంలో శుక్రవారం సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని చోట్ల వ్యక్తులు మద్యాన్ని సేవించడం అశ్లీల నృత్యాలు,పాటలు కొనసాగించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.

అత్యంత పవిత్రంగా జరగాల్సిన దైవ కార్యక్రమంలో ఇలాంటి సంస్కృతి భవిష్యత్తులో కొనసాగకుండా ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ విధించుకోవాలన్నారు. వినాయకుడిని వివేకం, విద్యకు ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మద్యపానంతో ఊరేగింపులో పాల్గొని నిమజ్జనం సందర్భంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విగ్రహ కమిటీ సభ్యులు ఈ తరహా సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆకుల కోటేశ్వరరావు ,కె.సతీష్ తదితర విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.