Subscribe Us

header ads

జంగారెడ్డిగూడెం లో అఖిలభారత ప్రగతిశీల సంఘం రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం.


జంగారెడ్డిగూడెం

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతి శీల సంఘం (ఏఐపి కె ఎస్) రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ భవనంలో అమర వీరుడు రాయల చంద్రశేఖర్ నగర్ నందు నిర్వహించడం జరిగింది.ఏ ఐ పి కె ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కె గౌస్ అధ్యక్షతన గరిగిన ఈ సమావేశంలోరైతు ఉద్యమం లో అమరులైన రైతులను స్మరిస్తూ సంతాప తీర్మానం ఎస్ కె గౌస్ ప్రవేశపెట్టారు.పార్టీ జాతీయ నాయకులు కెచ్చల రంగారెడ్డి సభను ప్రారంభించి ప్రసంగించారు.వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయించడం లేదని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఐ పి కె ఎస్ నాయకత్వన రైతాంగ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘమును రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తామని అందులో భాగంగా నిర్మాణం చేస్తున్నామని రంగారెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీని ప్రతిపాదించగా ఎస్కే గౌస్ కన్వీనర్ గా ఎస్ రామారావు జి ముత్యాలరావు బి సత్యనారాయణ సభ్యులుగా కమిటీ రూపుదిద్దుకోవడం జరిగింది.,రాష్ట్ర నాయకులు ఎస్కే గౌస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలు ఉన్నారని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని నాయకులు వివరించారు. 

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఏమాత్రం అమలు చేయలేదనిరైతులకు గిట్టుబాటు ధర కనుచూపుమేరలో కనిపించడం లేదని, పంటలకు భీమా చెల్లించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని,సమగ్రమైనపెట్టుబడి ఖర్చులు 50% కలిపి ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేయగా ప్రభుత్వాలు ఏమాత్రం రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకు సరైన మద్దతు ధర ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 రైతు సంఘాలు ఉమ్మడి ప్రణాళికతోఅక్టోబర్ 7,8 బెంగళూరు కేంద్రం గా రెండు రోజుల సమావేశాలలో దేశ రైతులు యొక్క సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించడం , నవంబర్ 26వ తారీఖున ఢిల్లీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలనితలపెట్టడం జరిగింది.

ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగారైతు సంఘం పోరాడుతుందని వివరించారు.పెట్టుబడిదారులకు అనుకూలంగాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి అని దుయ్యబట్టారు. వ్యవసాయంపై ఆధారపడి 48% ప్రజలు జీవిస్తున్నారనప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సిరికొండ రామారావు గడ్డల ముత్యాలరావు ప్రసంగించారు. ఏ ఐ పి కే ఎస్ జిల్లా అధ్యక్షులు కట్టం వీరాస్వామి అరుణోదయ జిల్లా నాయకులు కట్టం ముత్యాలరావు మేడిపల్లి సర్పంచ్ కట్టం రాంబాబు నార్లవరం ఎంపీటీసీ కే రత్తమ్మ తిరుమలపురం సర్పంచ్ ఎస్ విజయ నార్లవరం సర్పంచ్ ఎం రంగమ్మ పి ఓ డబ్ల్యు డివిజన్ నాయకురాలు ఎస్కే మున్ని అరుణోదయ కళాకారులు ప్రకాష్ వెంకటేష్ కారం భాస్కరరావు,ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.