Subscribe Us

header ads

వరద బాధితులకు అండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.


 కొయ్యలగూడెం,

 ఏలూరుజిల్లా కోయ్యలగూడెంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ముంపు బాధిత పంచాయితీలకు ప్రకటించిన విరాళాలను ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు 31 పంచాయతీలకు పోలవరం నియోజకవర్గంలో ఆయా పంచాయతీ సర్పంచులకు అందజేశారు. వరదల సమయంలో వయసు లెక్కచేయకుండా ప్రజల కోసం రాత్రనకా పగలనకా కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకు ఎంతో అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారని బాలరాజు అన్నారు .ఇది ఇలా ఉండగా గతంలో పంచాయతీ నిధులు కూడా స్వాహా చేసిన ప్రభుత్వం ఈరోజు వరద పీడిత ప్రాంతాలకు ఎటువంటి సహాయం చేయకుండా చేస్తున్న వారిపై విషప్రచారం చేస్తున్నారని చిర్రి బాలరాజు మండిపడ్డారు. 

ఇటువంటి క్లిష్ణ సమయంలో రాజకీయాలకు తావు లేకుండా అందరూ సహృదయంతో కష్టాల్లో ఉన్నవారికి సాయపడటమే అసలైన మానవత్వం అని బాలరాజు అన్నారు.
 అనంతరం నియోజకవర్గంలో 31 మంది సర్పంచులకు చెక్కులు పంపిణీ చేశారు. గతంలో పంచాయతీలకు ఎటువంటి నిధులు కేటాయించకపోగా ఉన్న నిధులు ప్రభుత్వం లాక్కున్న రాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోంత డబ్బులు పంచాయతీలకు నిధులుగా ఇవ్వటం చాలా హర్షనీయంగా ఉందని అన్నారు.