Subscribe Us

header ads

కొల్లేరు వరద ప్రభావిత గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందజేత.


  ఏలూరు/కుక్కునూరు:-

ఏలూరుజిల్లా కొల్లేరు వరద ప్రభావిత గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం ఉప్పుటేరులో వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా వున్న గుర్రపుడెక్క తూడులను తొలగించడానికి చేస్తున్న పనులను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్బంగా మండవల్లి మండలం వరద ప్రాంతమైన కొవ్వాడలంక గ్రామ ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల వరకు కొల్లేరు వరద కొనసాగుతుందని ఎవ్వరూకూడా ఇళ్లలోనుంచి బయటకు రాకూడదని సూచించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తారని ప్రజలకు తెలియజేశారు. 

అత్యవసరమైతే ప్రభుత్వం నియమించిన బోట్లు ద్వారా కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామ ప్రజలు కోరిన విధంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి జలజీవన్ పధకాన్ని ఈ గ్రామానికి వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ ని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రజలందరూ కొల్లేరు వరద తగ్గుముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.  వీరివెంట ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, వ్యవసాయశాఖ జెడి హబీబ్ బాషా, డిఎస్పీలు డి. శ్రావణకుమార్, జయసూర్య, ఇరిగేషన్ ఎస్ఇ సిహెచ్ దేవప్రకాష్, మండల తహాశీల్దారు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.