ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గంలో గల సొంఠ్య గ్రామపంచాయతీలోగత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆబోతు వానిపాలెం కల్వర్ట్ పూర్తికా కొట్టికి పోవటంతో నందున వర్షాకాలంలో ఎర్ర కణమాo, గొల్లల కణమాo పరిసర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలో రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు, కల్వర్ట్ నీటి తాకిడికి వాడవడంతో సమాచారం అందిన వెంటనే మండల తాసిల్దార్ శ్యామ్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బందితో అక్కడ చేరుకొని ముందస్తు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టారు. పరిశీలనలో ఆర్ఐ మణికంఠ, వీఆర్వో లక్ష్మి రైతులు తదితరులు పాల్గొన్నారు.