ఏలూరు /కుక్కునూరు:-
ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో గల గణపవరం గ్రామంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సతీష్ ఘడ్ లోని దంతేవాడకు చెందిన పైకి(18),కుమార్(24) అనే అన్నాచెల్లెలతో పాటు మరో ఇద్దరు వెరసి నలుగురు పది రోజుల క్రితం మండలంలోని గణపవరం గ్రామంలోని జామాయిల్ నర్సరీలో పనిచేయడానికి మకాం వచ్చారు. పైకి ఆదివారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లింది. గ్రామ సమీపంలోని జామయిల్ తోటలో ఓ చెట్టుకు ఉరివేసుకున్న పైకి మృతదేహం కనిపించడంతో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిందని కుక్కునూరు పోలీసులకు సమాచారం అందగానే కుక్కునూరు సీఐ రమేష్ బాబు,ఎస్సై రామకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఎస్సై మాట్లాడుతూ... గత పది రోజుల క్రితం జామాయిల్ నర్సరీలో పనిచేయడానికి అన్న,చెల్లెలు మకాం వచ్చారని, మృతురాలు పైకి పనిచేయకుండా ఫోన్ మాట్లాడుతుందని సోదరుడు కుమార్ మందలించాడు. ఆయిన ఆమెలో మార్పు రాలేదని ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందని ఫోను తీసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన పైకి బహిర్భూమికి వెళ్ళొస్తానని చెప్పి వెల్లింది. తిరిగి రాలేదని ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో బంధువుల దగ్గరికి వెళ్లిందనుకున్నారు.
సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు మిగిలిన మకాం కూలీలు మరికొందరు గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలోకి వెళ్లారు. ఆ జామాయిల్ తోటలోని ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకున్న పైకి మృతదేహం కనిపించింది. దీంతో మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపడతామన్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.