జీలుగుమిల్లి:
ఏలూరుజిల్లా జీలుగుమిల్లి మండలం తాటి ఆకుల గూడెం గ్రామం లో ఎ.పి.సి.ఎన్.ఎఫ్. ఎం.టి.ఎల్. బి. దినేష్ ఆధ్వర్యంలో రైతు రాయి సుబ్బారావు గారి వరి పొలంలో పవర్ వీడర్ ఉపయోగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.టి. ఎం.ధర్మరాజు మాట్లాడుతూ పవర్ విడర్ యొక్క ఉపయోగాలు రైతులకు వివరించడం జరిగింది ప్రాముఖ్యంగా పవర్ విడర్ వల్ల కలుపు నిర్మూలన జరిగి రైతులకు ఖర్చు తగ్గుతుందని అంతేకాక వేరు తెగి ఫలితంగా దుబ్బులు దృఢంగా పెరిగి ఎక్కువ పిలకలు ఇస్తుందని ఈ సందర్భంగా రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనిట్ ఇన్చార్జెస్ బి.నాగేశ్వరరావు, శాంత కుమారి, పాటేశ్వరి మరియు వారి ఐ సి ఆర్ పి లతో కలిసి హాజరు కావడం జరిగింది.