రంగన్నగూడెం:
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగయ్య అప్పారావు పేట వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తో పాటు స్వఛ్ఛందసంస్థలు ప్రజా ప్రతినిధులు ఆదుకోవటం అందరి సామాజిక బాధ్యత అని సాగునీటి వినియోగ దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు.గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకటరావు సూచనలతో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిదులు,గ్రామస్తులు వరద బాధితుల శిబిరంలో ఉన్న 100 మందికి పూర్తి స్థాయిలో భోజన ఏర్పాట్లను చేయటమే కాకుండా దగ్గరుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు రంగయ్య అప్పారావుపేట సర్పంచ్ కాకొల్లు అన్నామణి, ఎం.పి.టి.సి. సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ చేతులు మీదుగా అందరికి సరఫరా చేశారు.ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ బాపులపాడు మండలం లో మెట్ట ప్రాంత గ్రామాలలో ఉన్న ప్రజా ప్రతినిదులు, గ్రామస్తులు స్వచ్చంద సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలకు చేదోడు వాదోడుగా ఉండికానుమోలు, బాపులపాడు, గ్రామాలలో ప్రత్యేకశిబిరలల
ఉన్నఓగిరాల,రంగయ్యఅప్పారావుపేట,రామన్నగూడెం,ఆరుగొలను గ్రామస్తులకు ఆహార పదార్ధాలను అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రంగన్నగూడెం ఎం.పి.టి.సి. సభ్యులు పుసులూరు లక్ష్మీ నారాయణ, ఎం.పి.సి.ఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, గ్రామ ప్రముఖులు కసుకుర్తి అర్జున రావు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, పుసులూరు పూర్ణ వెంకట ప్రసాద్, మొవ్వా వేణుగోపాల్, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, మండల టిడిపి నాయకులు చలసాని శ్రీనివాసరావు,లింగం శ్రీధర్, కానూరి చంటి, ముల్లంగి బాబూరావు, దోనే అశోక్, వి.ఆర్.ఓ జి.ఝాన్సీరాణి,సచివాలయ సిబ్బంది,పాల్గొన్నారు.