ఖమ్మం:
ఎస్బిఐ సీజీమ్ హైదరాబాద్ సర్కిల్ శ్రీ రాజేష్ కుమార్ వర్చువల్ గా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినా రు.ఖమ్మం మొబైల్ బ్యాంకింగ్ సేవల ప్రారంభోత్సవంలో ఖమ్మం ఆర్ ఎం జి లింగస్వామి. ఖమ్మం సెప్టెంబర్ 06 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బి ఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలలో వినియోగదారుల మన్ననలు పొంది ఇతర బ్యాoకుల సేవలతో పోలిస్తే జాతీయ స్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు.అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచార బ్యాంకింగ్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. హైదరాబాద్ సర్కిల్ రాజేష్ కుమార్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజల అవసరాలను ప్రత్యేకంగా గుర్తించి మొబైల్ బ్యాంకింగ్ సేవల అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఖమ్మం రీజినల్ మేనేజర్ G.లింగస్వామి పాల్గొని మాట్లాడారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం మరోవైపు వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి,వినియోగదారులకు తమ నగదును డ్రా చేసుకోవాలంటే కొంతదూరం వరకు వెళ్లకుండానే, వ్యయప్రయాసలు లేకుండా వారు ఉన్న ప్రాంతంలోనే అక్కడ అందుబాటులో ఈ సంచార మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉండడంతో వారికి శ్రమ సమయం కలిసొస్తుందని పేర్కొన్నారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకింగ్ సేవలలో ప్రథమ స్థానంలో ఉందని, వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుదామని అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టపోయిన వరద బాధితులకు తమ బ్యాంకు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో వారిని ఆదుకున్న అంశాలను కూడా ఆయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.