జంగారెడ్డిగూడెం
ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన నాలుగు మాడ వీధులు, నాలుగు ముఖ ద్వారాలు మరియు 49అడుగుల ఎత్తుగల ఏక శిలా ధ్వజ స్తంభం కలిగి,భక్తుల కోరికలుతీర్చి , భక్తుల పాలిటి కొంగుబంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా సుందరముగా అలంకరించి,విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి , నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం, పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో సకాలంలో వర్షాలు కురవాలని,పాడిపంటలు సమృద్దిగా పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అమ్మ వారికి వెండి చీర తయారు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్ వాస్తవ్యులు పసుమర్తి భరద్వాజ గాయత్రీదేవి దంపతులు 10 తులాల వెండిని, తాళ్లూరి శ్రీరామ చౌదరి నాగమణి దంపతులు 5తులాల వెండిని అమ్మ వారి వెండి చీర నిమిత్తం అందజేసారని వారిని వారి కుటుంబ వ్యవసాయ, వ్యాపార ఉద్యోగాలను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని అన్నారు. ధన రూపంలోను, వస్తు రూపంలోను మరియు వాడని వెండి సామాగ్రిని కూడా అమ్మ వారి వెండి చీర తయారిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు
యావన్మమంది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి, అమ్మ వారిని దర్శించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మ వారి వెండి చీర తయారీలో భాగస్వాములై,అమ్మ వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు , రైతులు,తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బంది కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.