బుట్టాయిగూడెం:-
బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం రామారావు పేట సెంటర్ మధ్య ఉన్న కాలువ కాల్వర్ట్ ఇంటివలే కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయ్యింది.ఈ రోడ్డు మార్గం లో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది పాడయిపొయిన కల్వర్ట్ నిర్మించాలని అల్లూరి సీతారామరాజు యూత్ ఆధ్వర్యంలో నిరసన తెలపటం జరిగింది.ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు పవన్, మంగరాజు మాట్లాడుతూ రెడ్డిగణపవరం కాలువ కల్వర్ట్ పూర్తిగా పాడయిపొవటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనేక గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితి వచ్చి జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు వెళ్ళాలి అన్నా సరైన మార్గం లేదు ఎమర్జెన్సీ అయితే మధ్యలోనే ప్రాణాలు పోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చెసారు.
ఒకపక్క ఈ కల్వర్ట్ పాడయిపోతే మరో పక్క పట్టెన్నపాలెం బ్రిడ్జ్ కూడా పూర్తవక మా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ఏజెన్సీ గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది చాలని ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి రెడ్డిగణపవరం కాలువ కల్వర్ట్ వెంటనే నిర్మించాలని డిమాండ్ చెసారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కోర్స జలపాలు,పూనేం దుర్గారావు, కొమరం శ్రీరాములు, కట్టం వెంకటేశ్వరరావు, ఉయికె వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు కుంజా రవి,దారి రాజు, కోర్స చంద్రం,రవి చందు,పూర్ణచందు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.