రెడ్డిగూడెం;
ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ సిటీ నీ వర్షాల కారణంగా వచ్చిన వరద ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వారి బాధలని ఇబ్బందులను వాళ్లకు జరిగిన నష్టాన్ని గ్రహించి మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం లోగల గీతాంజలి హై స్కూల్ యాజమాన్యం, మరియు ఆ స్కూల్ విద్యార్థులు మేము సైతం ఉన్నామంటూ మా వంతు కృషి మేము చేస్తామంటూ మానవత్వంతో ముందుకు వచ్చింది. పిల్లలు దాచుకునే పాకెట్ మనీ నుంచి యాజమాన్యం సంపాదించే నెలవారి జీవితంలో నుంచి తమ వంతు తాము భారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.15.000./ విరాళం ఇచ్చారు. అతి చిన్న వయసులో ఉన్న విద్యార్థులకు ఇలాంటి పెద్ద ఎత్తున ఆపద వచ్చినచోట చిన్నచిన్న చేతులు కలిసి పెద్ద సహాయం ఇలా చేయవచ్చు అని పక్కవారికి సహాయం చేసే విధానం పట్ల అవగాహన కల్పించి వారిలో మానవత్వం పెంచుతూ విద్యలో ముందుకు తీసుకెళుతున్న గీతాంజలి హై స్కూల్ యాజమాన్యానికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.