జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా వరద బాధితుల సహయార్థం 50 వేల రూపాయలను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కి కా మవరపుకోట మండలం తాడిచెర్లలో అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహయార్థం బీసీ నాయకులు మిడత పెంటయ్య గౌడ్ (ఎంపీ గౌడ్) 50 వేల రూపాయలను అందజేయడం జరిగింది అని త్వరలోనే స్వచ్ఛందంగా ఇచ్చే దాతల ఫండ్ ను ముఖ్య మంత్రి, చంద్రబాబు నాయుడుకి అందచేస్తాం అని తెలిపారు.
ఈ సందర్బంగా దాత మిడత పెంటయ్య గౌడ్ (ఎంపీ గౌడ్) మాట్లాడుతూ విజయవాడలో జరిగిన వరద బాధితుల సహయార్థం తన వంతు ఆర్థిక సహాయం 50 వేల రూపాయలను చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ కు అందజేయడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, రావికంపడు సర్పంచ్ వేముల నాగేశ్వరరావు (అడ్డరోడ్డు శ్రీను), తాడిచెర్ల సర్పంచ్ పసుమర్తి పార్థసారధి బాబు, మిడత సురేష్ గౌడ్, కమవరపుకోట మండల టీడీపీ అధ్యక్షుడు కిలారీ సత్యనారాయణ, అడమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు, కమవరపుకోట కోట మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గంటా సత్యంబాబు, బేతిన వెంకట్రావు, ఇమ్మడి సురేష్, కొనేరి సుబ్బారావు, నెక్కంటి సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కమవరపుకోట గంటా సుదీర్ బాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.