వేలేరుపాడు:-
ఏలూరుజిల్లా వేలేరుపాడు మండలం సెప్టెంబర్ 3 న పోలవరం శాసనసభ్యులు బాలరాజు వేలేరుపాడు మండల పర్యటనలో భాగంగా మేడేపల్లి మరియు అల్లూరి నగర్ గ్రామస్తులు చిర్రి బాలరాజు దృష్టికి హ్యాండ్ బోర్డ్ సమస్య తీసుకురావడం జరిగింది.
గోదావరి వరద వల్ల వారికి తాగునీరు సమస్య ఉందని వారి సమస్యను తెలుసుకున్న చిర్రి బాలరాజు ఆ గ్రామల్లో స్థలాన్ని పరిశీలించి నేడు అనగా 14-09-2024 శనివారం నాడు హ్యాండ్ బోర్లు వేయడం జరిగింది.కేవలం పది రోజుల్లోనే సమస్యను పూర్తి చేసినందుకు గ్రామస్తుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మండల వైస్ ప్రెసిడెంట్ మేచినేని సంజయ్,మండల ప్రధాన కార్యదర్శి క్రాంతి, శివరాం, భాను, వీరాస్వామి, చాపర్ల శ్రీను, సర్పంచ్ మరియు సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు.