మొవ్వ:-
మొవ్వ మండలం కాజా గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో తమ గృహాలతో సహా సర్వస్వం కోల్పోయిన ఆరు కుటుంబాలకు సి.పి.ఐ పార్టీ నేతలు శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలైన పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు తిరువీధి నాంచారమ్మ, తిరువీధి పోలమ్మ, చలం రామయ్య, ఈగ శేషయ్య, మాణికల సుబ్రహ్మణ్యం, యాదగిరి ఏసమ్మ, కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ సి.పి.ఐ కార్యదర్శి చెరుకు శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కోదాటి నారాయణరావు, పామర్రు నియోజకవర్గ సి.పి.ఐ సహాయ కార్యదర్శి చందోలు నాగేశ్వరరావు, మోదుమూడి సద్గుణరావు, చేనేత కార్మికులు కోదాటి కనకదుర్గారావు, నందం వెంకట నరసింహారావు, కోదాటి ఈశ్వర ప్రసాద్, పంచల మోహన్రావు, గౌరీ సత్యప్రసాద్, నందం శ్రీనివాసరావు, పాల్గొన్నారు.