మొవ్వ:
మొవ్వ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు క్షీరాభిషేకం చేశారు. గత 65 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖను గత ప్రభుత్వం స్పెషల్ ఇన్ఫోసిమెంట్ బ్యూరోగా మార్పిడి చేసింది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి దానిని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖగా మార్పిడి చేసి సిబ్బందిని దానికి బతలాయించడంతో మొవ్వ ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ పి. హేమ సుశ్విత, మరియు సిబ్బంది పాల్గొన్నారు.