Subscribe Us

header ads

పౌష్టికాహార పదార్థాలపై అవగాహన కల్పించిన సూపర్వైజర్ కే.కుమారి

 రెడ్డిగూడెం

ఎన్టీఆర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మైలవరం,రెడ్డిగూడెం మండలలో పౌష్టికాహార మహోత్సవాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అన్నేరావుపేట గ్రామంలోఎం.పి.యుపి స్కూల్ నందు శనివారం నాడు పౌష్టికాహార మహోత్సవములు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడి సూపర్వైజర్ కే కుమారి మాట్లాడుతూ ఎం.పీ.యు.పి స్కూల్లో పిల్లలకు సంప్రదాయ పంటలపై అవగాహన కల్పించడం మరియు సమతుల ఆహారం పై అవగాహనా కల్పించడం విటమిన్స్ ఏ ఆహారం లో ఉంటాయి విటమిన్స్ వల్ల కలిగే లాభాలు నష్టాలు మధ్య తేడాను పిల్లలకు వివరించారు. మరియు విటమిన్స్ లభించే ఆకుకూరలు, పండ్లు మీద వారికి క్విజ్ నిర్వహించి 10మంది పిల్లలకు బహుమతులు అందజేశారు.   ఈ కార్యక్రమంలో ఎంపీ యూపీ స్కూల్ హెచ్ఎం టి భాస్కరరావు మరియు స్టాప్ ఐ. సి.డి.ఎస్ సూపర్వైజర్ కే.కుమారి, అంగన్వాడి వర్కర్స్ తదితరుదులు పాల్గొన్నారు.