రెడ్డిగూడెం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను నిలిపివేశామని వెల్లడించిన వైద్య అధికారులు డాక్టర్.సందేశ్, డాక్టర్.మణి బాబు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మీడియాతో మాట్లాడుతూ పీజీ వైద్య విద్య లో ఇన్ సర్వీస్ కోటాను కుదిస్తూ తెచ్చిన 'జీ.వో నంబర్ 85"ని వ్యతిరేకిస్తూ రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని అన్నారు.గత రెండు రోజుల క్రితం నుంచి 13 వ తేదీ, 14వ తేదీలో అత్యవసర సేవలను చూడడం జరిగిందని 16వ తేదీ నుండి నిర్విరామంగా పూర్తిగా అన్ని సేవలను నిలిపివేయడం జరుగుతుందని అన్నారు.