Subscribe Us

header ads

వరద బాధితులకు చిన్నారుల సాయం,విద్యార్ధుల సహృదయానికి ముచ్ఛటపడి అభినందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.


 ఏలూరు:

ఏలూరుజిల్లా విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు చిన్నారుల సైతం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు బాయిస్ కాన్వెంట్ లో 9వ తరగతి చదువుచున్న అనకాపల్లి నందకిషోర్, అనకాపల్లి వెంకట్, 7వ తరగతి చదువుచున్న శ్రీరాం, తాము సేకరించిన రూ. 5,045/- లను డిఇఓ ఎస్. అబ్రహాం ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వారికి అందజేశారు. పాఠశాల శెలవు రోజుల్లో ఇంటింటికి తిరుగుతూ వీరు విరాళాలు సేకరించారు. వీరి సహృదయానికి ముచ్ఛటపడి విద్యార్ధులు సేకరించిన రూ. 4,345/-లకు తోడుగా ఉధ్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మెహన్, ఎపిఎంఐపి పిడి రవికుమార్ మరో రూ. 700/- లను విరాళం అందించారు. ఈ సందర్బంగా చిన్నారులు చేసిన మంచి పనిని జిల్లా కలెక్టర్ మెచ్చుకున్నారు.