జంగారెడ్డిగూడెం:
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 5వ సచివాలయం పరిధిలో 12,13,14 వార్డుల్లో
" ఇది మంచి ప్రభుత్వం " అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సచివాలయ అడ్మిన్ వాసు, నరసింహారావు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి మోడీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ల పిలుపు మేరకు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందించే తీరును,మరియూ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈకార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్,సీనియర్ నాయకులు,మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు,అబ్బిన దత్తాత్రేయ, పరిమి ధర్మరాజు,పాతూరి అంబేద్కర్,బొబ్బర రాజ్ పాల్,షేక్ పీర్లు,మీనా శ్రీను, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు,ఎన్ని త్రినాధ్,జోగి నాగరాజు, సాయిల రాంబాబు,దొండపాటి శ్రీను, తలారీ సత్యనారాయణ ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.