Subscribe Us

header ads

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం


 రెడ్డిగూడెం:

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన కుటమి నాయకులు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా వేణుగోపాల స్వామివారి ఆలయం నందు ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆంజనేయస్వామికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తేదీన గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన 11రోజులు పాటు ఉంటారు. అనంతరం తిరుమల ఏడుకొండల స్వామి వారిని దర్శించుకుంటారు. 

ఉప ముఖ్యమంత్రి చేపట్టిన ఈ దీక్షకు సంఘీభావంగా ఈ రోజు అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది.మిగిలిన 8రోజుల పాటు మండలంలోని గ్రామాలలో ఇదే విధంగా ప్రత్యేక పూజలు కొనసాగిస్తామని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విజయబాబు,నాగేశ్వరరెడ్డి,బలగానిగోపీ,తోట క్రాంతిబాబు,బొల్లిపోగుప్రకాష్,కిరణ్కుమార్ రెడ్డి, బాలకృష్ణ,చాట్లచందా,రామారావు, కృష్ణ,పెద్దబ్బాయి, మణికంఠ,కొండ,నాగరాజు,యువరాజు, శివనాగులు,ప్రవీణ్ ఇంకా కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.