భద్రాచలం:
ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్ నందు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఈ సందర్భంగా పెళ్ళాం వెంకట్రావు మాట్లాడుతూ... వైద్యులు ఎవరు కూడా సెలవులు తీసుకోకుండా అందుబాటులో ఉంటూ, హాస్పిటల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ లో ఉన్న ప్రజలతో మాట్లాడి వైద్యులు అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు.
నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏరియా హాస్పిటల్ లో అనేక రకాల అనారోగ్య సమస్యలపై ప్రజలు వస్తా ఉంటారు, వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు , మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, అరికెల తిరుపతిరావు, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి , పుల్లగిరి నాగేంద్ర, రసమళ్ళ రాము, గాడి విజయ్, ఆకుల వెంకట్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.