Subscribe Us

header ads

చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పదార్థాలు.


 జంగారెడ్డిగూడెం:

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషిగా స్పందించి సహాయం చేయాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యం లో విజయవాడ వరద భాధితులకు పలు రకాల ఆహార పదార్ధాలను పంపారు. ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో వ్యాపారులు దుప్పట్లు, బిస్కట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వోత్తులు, పండ్లు, కూల్ డ్రింక్స్, ఇతర నిత్యావసర సరకులను పంపారు.

 సీటివో బి. వినోద్ కుమార్, డిఎస్పి చేతుల మీదుగా విజయవాడ వరద భాదితులకు తరలించారు. సుమారు. రూ. 1.50 లక్షల విలువైన వస్తువులను పంపినట్లు ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు వెల్లడించారు. సుబ్రహ్మణ్యం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆపిల్స్ ను అందజేశారు.కార్యక్రమంలో అధ్యక్షులు వందన వెంకటేశ్వరావు ఉప్పల గంగాధర్ రావు బలరాం రాంబాబు దోబ గుంట్ల బాపిరాజు సొలస శ్రీనివాసరావు, దారా రవి శ్రీనివాసరావు, గొల్లపూడి శ్రీనివాసరావు, నాగసూరివసంత్ కుమార్ కిరాణా అసోసియేషన్ క్లాత్ మర్చంటు ఫాన్సీ అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ గోల్డ్ అసోసియేషన్ సిమెంట్ మెడికల్ అసోసియేషన్ ఓ బి వినోద్ కుమార్ కొప్పుల సత్యనారాయణ అనిపూడి వెంకటేశ్వరరావు సిటిఓ సిబ్బంది
పాల్గొన్న