కొయ్యలగూడెం,
ఏలూరుజిల్లా కొయ్యలగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సత్వర చర్యలు అందించకపోతే చర్యలు తప్పవని కొయ్యలగూడెం మండల పరిషత్ అధ్యక్షులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంజిమాల రామారావు హెచ్చరించారు. సోమవారం కొయ్యలగూడెం ఆస్పత్రిలో రోగులకు ఒపి సక్రమంగా జరగడం లేదని వచ్చిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. హుటాహుటిన ఆస్పత్రి తనిఖీ చేశారు.ఒక మెడికల్ ఆఫీసర్ ఒపి చూడకుండా బయటకు వెళ్లిపోయారని, రోగుల సంఖ్య అధికంగా ఉన్నారని రోగుల బందువులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎంపిపి ఆస్పత్రికి వెళ్ళారు. ఫిర్యాదు విషయం సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఒక డాక్టర్ ఆకస్మికంగా ఒపి లో రూమ్ లో ప్రత్యక్ష మయ్యారనీ సిబ్బంది, రోగుల చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపిపి రామారావు ఒపీని, వార్డును పరిశీలించి సున్నితంగా సిబ్బందిని మందలించారు.రోగుల సేవల విషయంలో ఆరోపణలు రాకుండా చూసుకోవాలన్నారు. రోగుల నుంచి ఫిర్యాదులు వస్తే క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.త్వరలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు.రోగులను పరామర్శించి అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు