ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం, పట్టణ కింగ్ ఆఫ్ కింగ్స్ నందమూరి బాలకృష్ణ ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నందమూరి అందగాడు, నటరత్న ఎన్టీఆర్ వారసుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం చేసి 50వసంతోత్సాలు (అన్ స్టాపబుల్) గా పూర్తిచేసుకున్న శుభసందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మ వారి దేవస్థానం, కళ్యాణ కళావేదిక వద్ద , ఆలయ ఛైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ( పండు) ముఖ్య అతిథిగా విచ్చేసి, బాలయ్య బాబు అభిమానుల జై బాలయ్య జై జై బాలయ్య నినాదాల నడుమ కేకు కోసి 50యేళ్ళ వసంతోత్సవాలు ప్రారంభించారు డాక్టర్ రాజాన మాట్లాడుతూ,బాలయ్య బాబు 1960, జూన్ 10న బసవతారకం, రామారావు పుణ్య దంపతులకు జన్మించారు. 1974 ఆగస్ట్ నెలలో " తాతమ్మకల"చిత్రంతో తెరంగేట్రం చేసి, నాటి నుండి నేటి వరకు అన్ స్టాపబుల్ కథానాయకుడిగా108 చలన చిత్రాలు విజయవంతంగా పూర్తిచేసుకొని,109వ చిత్రంతో శరవేగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని అన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మ వారి దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయంతమైన చిత్రాలలో నటించి రాణించాలని తెలియజేశారు. స్థానిక అమ్మ ప్రేమ అనాధ ఆశ్రమ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు మిఠాయిలు వితరణ చేశారు.
ఈ సందర్భంగా చిటికెన రాంబాబు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జూన్ నెల 10వ తేదీన క్రమం తప్పకుండా బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ, అనాధ ఆశ్రమ పిల్లలకు, వృధ్ధాశ్రమాలకు అన్న దాన కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారికి చేయూతనిస్తున్నామని అన్నారు.
రాగాని శ్రీనివాస్ మాట్లాడుతూ,బాలకృష్ణ మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి బాలకృష్ణ, మట్టా నరసింహారావు, రాగాని శ్రీనివాస్, పేరాబత్తుల చిన్నారావ్, ఇనుముల తాతయ్య, జుత్తుగ శ్రీను, ముప్పిడి చంటిబాబు, చిటికెన రాంబాబు, రొంగల బ్రదర్స్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని తెలియజేశారు.