ఆనందపురం
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధుల బృందం అనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల కుసులవాడ పంచాయతీ పరిధిలోని మైనింగ్ కొండను బుధవారం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ బృందం పరిశీలించారు
ఈ సందర్భంగా అజయ్ శర్మ గారు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగే మైనింగ్ అనుమతులను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు కుసులవాడ భూముల్లో క్వార్ట్ జైట్ మైనింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్ 1533 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కుసులవాడ సర్వే నెంబరు 104లోగల 69 హెక్టార్లలో 7.991 హెక్టార్లలో రఫ్ స్టోన్ గ్రావెల్, క్వార్ట్జ్జైట్ మైనింగ్కు విఆర్ ఇన్ఫ్రా అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ సంస్థకు అనుమతులు . కొండలు, ప్రకృతిని ధ్వంసం చేస్తే పర్యావరణానికి, ప్రజలకు తీవ్ర ప్రమాదమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా ? అని ప్రశ్నించారు. ప్రకృతి సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నారు. కానీ ఆ ప్రభుత్వాలే ప్రకృతి విధ్వంసానికి పూనుకోవడం అమానుషమన్నారు.
కుసులవాడ కొండల ధ్వంసం వల్ల పర్యావరణానికి, ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆ ప్రాంత ప్రజల జీడి, మామిడి, కొబ్బరి తోటలతో పాటు ఇతర పంటలకు ఆపార నష్టం కలుగుతుందని తెలిపారు. పశు సంపద నష్టపోతారని, గాలి, తాగునీరు కలుషితమవుతాయని, కాలుష్య ప్రమాదం పెరుగుతుందని అన్నారు. తుపాను వంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కుసులవాడ ఎస్సి కాలనీ, చిన్నయ్యపాలెం ఎస్టి కాలనీ, రేగానిగూడెం, గొల్లలపాలెం, ఇచ్ఛాపురం తదితర గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం రుషికొండ, ప్రకృతి ధ్వంసానికి పూనుకొంటే సిపిఎంతో పాటు టిడిపి, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పర్యావరణ కాముకులు, వ్రజలు పెద్దఎత్తున ఆందోళన చ�