Subscribe Us

header ads

వేలేరుపాడు కార్యాలయములో 8919936844 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు.

ఏలూరు/జంగారెడ్డిగూడెం/వేలేరుపాడు,:

943 కుటుంబాలకు 25 కేజీల చొప్పున 23,575 కిలోల బియ్యం పంపిణీ, సహాయ చర్యలకు ఎస్ డిఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు సిద్ధం. జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య. ఏలూరుజిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో 943 కుటుంబాలకు కుటుంబానికి 25 కేజీల చొప్పున 23,575 కిలోల బియ్యం పంపిణీ చేసినట్లు జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య తెలిపారు. బుధవారం వేలేరుపాడులో అన్ని శాఖల అధికారులతో ఆర్డివో కె. అద్దయ్య వరద పరిస్ధితిపై సమీక్షించారు. 

ఈ సందర్బంగా ఆర్డివో మాట్లాడుతూ గోదావరి వరద ప్రభావితానికి యడవల్లి సమీపములో గల ఎద్దువాగు బ్రిడ్జి పై నీరు పొంగుటవలన ఎద్దువాగు పై గల కట్కూరు , కోయిదా గ్రామపంచాయతీలలో గల 15 గ్రామాల ప్రజలు గోదావరి వరద వలన నష్టపోయారని గుర్తించి జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు బుధవారం ఆయా గ్రామాలలో 943 కుటుంబాలకు 25 కేజీల చొప్పున 23,575 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున 943 కిలోలు, కిలో పంచదార చొప్పున 943 కిలోలు, లీటర్ పామాయిల్ చొప్పున 943 లీటర్లు, కేజీ ఉల్లిపాయిలు చొప్పున 943 కిలోలు, కేజీ బంగాళదుంపలు చొప్పున 943 కేజీలు, 5 వేల మంచినీటి ప్యాకెట్లు అందించడం జరిగిందన్నారు. 

 కోయిదా, టేకుపల్లి గ్రామలలో పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు చేతుల మీదుగా ప్రారంభించి పై 15 గ్రామాలలో పంపిణీ పూర్తి చేయడమైనదన్నారు. సెంట్రల్ వాటర్ కమీషన్ వారు భద్రాచలం దగ్గర బుధవారం మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున వేలేరుపాడు మండలములో గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడమైనదన్నారు. ఈ సందర్బంగా వేలేరుపాడులో అన్ని శాఖల అధికారులతో ఆర్డివో కె. అద్దయ్య వరద పరిస్ధితిపై సమీక్షించారు. ప్రతి గ్రామానికి సూపర్ వైజర్ ఆఫీసర్లగా మండల స్ధాయి అధికారులను నియమించడమైనదన్నారు. మండలంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు , పునరావాస కేంద్రాలకు తరలించేందుకు 15 మోటర్ బొట్లును సిద్ధం చేశామన్నారు.

 30 ట్రాక్టర్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. మెడికల్ డిపార్ట్మెంటు వారిని మెడికల్ క్యాంపు నిర్వహించుటకు చర్యలు తీసుకోనవలసినదిగా , గ్రామ పంచాయతీ సిబ్బందిని శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయవలసినదిగా ఆదేశించడమైనదన్నారు. వేలేరుపాడు మండలానికి 24 మందితో కూడిన ఎస్ డిఆర్ఎఫ్ బృందం, 20 మంది సభ్యులతో కూడిన స్పెషల్ పార్టీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొరకు సిద్ధంగా ఉన్నారన్నారు. వరద పరిస్థితిని బట్టి ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేసి వరద సమయములో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 

వేలేరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ప్రజలు సౌకార్యర్థం 8919936844 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం నుండి వరద ప్రభావం రీత్యా డ్యూటీ వేసిన అధికారులు అందరూ వారి కేటాయించిన గ్రామాలలో నివాసం ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినచో తగు చర్య నిమిత్తం జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో డ్వామా పిడి ఎ. రాము, తహశీల్దారు డివి సత్యనారాయణ, చల్లన్నదొర, డిఎల్ పివో రజఉల్లా, యంపిడివో మూర్తి, ఇవోఆర్డి తదితరులు పాల్గొన్నారు