Subscribe Us

header ads

బాగా చదివే పేద పిల్లలకు ఆర్థిక సహాయం


 భీమునిపట్నం

 స్థానిక ఒకటవ వార్డు, జి వి యం సి ప్రాథమిక పాఠశాల, బంగ్లామెట్ట నందు స్వచ్ఛతా పక్వాడ లో భాగంగా ప్రధానోపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులతో పాటు స్థానిక నాయకులు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ యువత నాయకుడు గరే సదానంద తన సొంత డబ్బులతో పాఠశాలకు స్కాలర్ షిప్ ఏర్పాటు చేశారు. ప్రతి నెల పాఠశాలలో బాగా చదివే పేద విద్యార్థులకు తన వంతుగా 500 రూపాయలు చొప్పున సహాయమందిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రెండు వేల డబ్బులను విద్యార్థులకు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ చేతుల మీదుగా అందించారు. చదువుకునే విద్యార్థులకు తన తరఫున ఎటువంటి సహాయం అవసరమైన తాను చేస్తానని వారికి ఆభయ మిచ్చారు.పాఠశాల అభివృద్ధి పథంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గరే సదానంద తెలియజేశారు..ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత మంది దాతలు పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటారని పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ షేక్ షర్మిల తెలియజేశారు. 

పాఠశాల అభివృద్ధిలో తమ వంతు ఎటువంటి సాయమైన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్థానిక తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు తెలియజేశారు. దాతల సహాయ సహకారాలతో పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి తమ వంతు కూడా కృషి చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు తెలియజేశారు. స్వచ్ఛతా పక్వాడ లో భాగంగా ప్రధానోపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ,ఉపాధ్యాయులు నరహరిశెట్టి రమేష్, బుగత మల్లిక ఇంటింటికి వెళ్లి విద్యార్థుల చదువుపై ఎటువంటి సందేహాలు ఉన్న తమను సంప్రదించమని తెలియజేశారు. 

ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించమని తల్లిదండ్రులకు తెలియజేశారు. బాగా చదివే విద్యార్థులకు ప్రభుత్వం తగిన ప్రోత్సహకాలు అందిస్తుందని అదేవిధంగా స్థానిక దాతలు కూడా స్కాలర్ షిప్ ఏర్పాటు చేశారని తెలియజేశారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత తల్లిదండ్రులు ఇంటిదగ్గర నేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఆంగ్లంలో సంభాషిస్తే విద్యార్థులకు ఆంగ్ల భాష పై మరింత పట్టు వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ కమిటీ వైస్ చైర్మన్ పందిరి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు గరే చంద్రమౌళి,తమ్మిన అశోక్, దొంతల పైడిరాజు, పందిరి నాని బాబు తదితరులు పాల్గొన్నారు.