Subscribe Us

header ads

జిల్లా విద్యా శాఖ అధికారి జి.పగడాలమ్మ ఆకస్మిక సందర్శన...


 సాలూరు:

సాలూరు పట్టణం లో 
ప్రభుత్వ ఉన్నత పాఠశాల 
సాలూరు మండలం కి ప్రత్యేక అధికారి అయిన పార్వతీపురం 
మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పగడాలమ్మ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు ను ఆకస్మికంగా సందర్శించారు, దీనిలో భాగంగా క్రింది తరగతుల పిల్లలకు భాషా ఇంకా లెక్కలు లో కనీస ప్రావీణ్యత,10వ తరగతి విద్యార్థులను ఉద్ధేశించి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధానం, మంచి మార్కులను సంపాదించటం లో మెలకువలు చెపుతూ తల్లిదండ్రులను,గురువులను గౌరవిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు..ఇంకా సిబ్బంది తో ప్రత్యేక చర్చా వేదిక నిర్వహించారు... సలహాలు ,సూచనలు ఇస్తూ ఫలితాల సాధనలో మీ కృషి చేయాలని కోరారు...తదుపరి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ సంబరాలు కార్యక్రమంలో చెకుముకి పరీక్షా పత్రాలు జే.వీ.వీ.ప్రతినిధి సీనియర్ సైన్స్ ఉపాద్యాయ లు కే.వీ.సత్యనారాయణ మాష్టారు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు... కార్యక్రమంలో ఇన్చార్జి ఉపాధ్యాయులు సుధీర్ రాజు ఇతర ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.