ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో"నులిపురుగుల నివారణ దినోత్సవం "మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ, అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్, మరియు కాలేజీ విద్యార్నిని, విద్యార్థులు కు 1సంవత్సరము నిండిన పిల్లల నుండి 19సంవత్సరాల పిల్లలకు, ఆల్బండాజోలు మాత్రలు మింగించడం జరిగినది.
ఇందులో భాగంగా రెడ్డిగూడెం జడ్.పి.హెచ్. స్కూల్ లో ఎంపీడీఓ విష్ణు ప్రసాద్,మండల విద్యాశాకాధికారి రమేష్ బాబు ,స్థానిక నాయకులు గోగులమూడి. రవీందర్ రెడ్డి మరియు ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాంసుందరరావు, హై స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, హెల్త్ సిబ్బంది సురేష్,ఆరోగ్య కార్యకర్త విమల, ఆశ వర్కర్స్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు అందించడం జరిగినది.
రెడ్డిగూడెం మండల పరిధిలో ని "6992" మంది పిల్లలు ఆల్బండాజోలు మాత్రలు మింగించడం జరిగినది.