చాట్రాయి:
వివిధ కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలోనే మానేసిన విద్యార్థులు, గృహిణులు తిరిగి చదువుకునేందుకు సార్వత్రిక విద్య దోహదప డుతుందని, ఇది వారికి వరం లాంటిదని చాట్రాయి ఎంఈఓ వి ఎస్ వి బ్రహ్మాచారి అన్నారు. చాట్రాయి హైస్కూల్ లో ,అంగన్ వాడీ,వెలుగు మహిళా సమాఖ్య సభ్యులతో మంగళవారం సమావేశంనిర్వహించారు. ఈసమావేశంలోఆయన మాట్లాడుతూ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ దూర విద్యలో ప్రవేశాలు, అభ్యాసం తదితర విష యాలను వివరించారు. 14 ఏళ్ల వయస్సు కలిగి, చదువు మధ్యలో మానే సిన విద్యార్థులు ఓపెన్ టెన్త్, 16 ఏళ్లు నిండి,పదో తరగతి పాసైన వారు ఇంటర్మీడియెట్ విద్యను అభ్యసించ వచ్చన్నారు. హైస్కూల్లో పదో తరగతి అభ్య సించేందుకు అవ కాశ ముందని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంఘాలు, పాఠశాల హెచ్ఎం డి కృష్ణయ్య ,అంగన్ వాడీ సూపర్వైజర్ గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.