Subscribe Us

header ads

విజయవాడలో వరద బాధితులకు అండగా ఉండాలి. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.


 కామవరపుకోట:

ఏలూరుజిల్లా విజయవాడలోని వరద భాదితులకు అండగా ఉండాలి అని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కామవరపుకోట, వీరిశెట్టిగూడెం,ఆడమిల్లి, తాడిచర్ల, పోలసీగూడెం కు చెందిన టీడీపీ నేతలు కలిసి మాజీ ఏ ఎమ్ సి చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మరియు మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్ బాబు నెత్రుత్వంలో ఏలూరు లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద రోషన్ కుమార్ కి 3,10,000రూపాయలు చెక్ అందచేయడం జరిగింది,చెక్ అందుకున్న అనంతరం ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి విరాళాలు సేకరించి నా దగ్గరకు వచ్చి డి డి లు అందచేసిన వారికి పేరు పేరునా అభినందనలు తెలియచేసారు,కష్ట సమయంలో ఎదుటివారికి సహాయం చేయడం చాలా సంతోషం అని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు..
చెక్ అందచేసిన వారిలో నెక్కలపు సూర్యనారాయణ, బిక్కిన వెంకట్రావు రాయపాటి భాస్కర్ రావు,చదలవాడ నానీ,ఏలూరి హరి,గంగాధర్ రావు, రాటాలు, డాన్ దివాకర్ బొబ్బిలి,నాగు చింతపల్లి కాంతారావు,పిల్లలమర్రి వెంకటేశ్వర్రావు,నాన్న హరిచంద్ర,గోధుమ మధు, అనిల్, వెంకట్,సూరమ్ సుధీర్ తదితరులు తో పాటు వైశ్య సంఘానికి చెందిన కొండూరు రాజా, శ్రీధర్, సురేష్, రామ కృష్ణా, పత్తి కుమార్ పాల్గొన్నారు,