Subscribe Us

header ads

పొలం పిలుస్తోంది


 చాట్రాయి:


మండల కేంద్రమైన చాట్రాయిలో వ్యవసాయ శాఖ అధికారి బి శివ శంకర్ ఆధ్వర్యంలో "పొలం పిలుస్తుంది" కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను మరియు పంటల యాజమాన్యం గురించి, పంటలకు కలుగు చీడపీడలు వాటి నివారణ గురించి వివరించారు. సూక్ష్మ పోషకాల విలువలు సమగ్ర పోషక యాజమాన్యం గురించి వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ ద్వారా అందించు ట్రిప్ పరికరాలు మార్చి మిరప శాశ్విత పందిరులు వాటి రాయితీ వివరాలను రైతులకు తెలిపారు. తరువాత వరి క్షేత్ర ప్రదర్శన చేసి రైతులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి, లీగల్ అడ్వైజర్ అత్తులూరి శ్రీనివాసరావు, రాయవరపు పుల్లారావు, కంపల్సటి చెన్నారావు, జనసేన నాయకులు తుమ్మల జగన్ తదితరులు పాల్గొన్నారు.