ఏ కొండూరు:
తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు (మ) ,
NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదేశానుసారం పొలిశెట్టిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేరుగా ప్రజల్లోకి వెళ్లి కరపత్రాలను పంచి,వంద రోజుల్లో ప్రజలకి జరిగిన మంచిని వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య, పోలిశెట్టిపాడు సర్పంచ్ చిట్టిబాబు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు