లింగపాలెం:
ఏలూరుజిల్లా ఏపీఎస్ఆర్టీసీ లో ప్రయాణం చేసి 100 రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో *ప్రయాణికులను స్వయంగా అడిగి తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ. సొంగ రోషన్ కుమార్
"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం పేరుతో మీ ముందుకు
అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం అందిస్తాము
గత ప్రభుత్వ వైపల్యంతో అభివృద్ధి వెనక్కి పోయింది.
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశీర్వదించారు
ప్రజలకిచ్చిన హామీలను, కూటమి ప్రభుత్వం అమలుచేస్తుంది.
"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వలసపల్లి నుండి ధర్మాజీగూడెం వరకు ప్రయాణించి స్వయంగా ఎమ్మెల్యే ప్రయాణికులతో అభిప్రాయాలు తెలుసుకున్నారు.
100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలు, గోడ పత్రాలు పంపిణీ చేశారు...
అనంతరం ధర్మాజీగూడెం గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు... ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని ప్రజలు ఎమ్మెల్యే కు వివరించారు. ప్రజల అభిప్రాయాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇంకా ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, లోటు బడ్జెట్ ఉన్న సంక్షేమానికి ఏ లోటు రాకుండా ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళ్లుతున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు