Subscribe Us

header ads

బుడమేరు ప్రధాన డ్రెయిన్ అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించిన ఆళ్ళ


  విజయవాడ:-

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
కృష్ణా డెల్టా ఆయకట్టును, విజయవాడ పట్టణాన్ని బుడమేరు ప్రధాన డ్రెయిన్ వల్ల వరదలతో మునిగిపోకుండా కాపాడటానికి, బుడమేరు వాగుకోర్సు, బుడమేరు డైవర్షన్ ఛానల్ అభివృద్ధి చేయటానికి కేంద్రం నిధులు కేటాయించాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదలకు బుడమేరు ప్రధాన డ్రెయిన్ ఉప్పొంగి విజయవాడ పట్టణం, ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం ఈరోజు ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని సందర్శించిన సందర్భంగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు బుడమేరు ప్రధాన డ్రెయిన్ అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలని పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు. 

ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ బుడమేరు ప్రధాన వాగు ఉమ్మడి కృష్ణా మెట్ట ప్రాంతంలో 72 కిలోమీటర్లు డెల్టా ప్రాంతంలో 56 కిలోమీటర్లు మొత్తం 128 కిలోమీటర్ల మేర ప్రయాణించి కొల్లేరులో కలుస్తుందని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 లో బుడమేరు ప్రధాన డ్రెయిన్ ను, బుడమేరు డైవర్షన్ ఛానల్ ను అభివృద్ధి చేయటానికి స్మార్ట్ సిటీ ప్రోగ్రాంలో భాగంగా స్టార్మ్ వాటర్ డ్రెయిన్ గా అభివృద్ధి చేయటానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి దశ-దిశ నిర్దేశంతో 464 కోట్లతో ఎస్టిమేట్ వేసి కేంద్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతికోసం డి.పి.ఆర్ సమర్పించటం జరిగిందని, ఈ దశలో 2019లో అధికారంలోకి వచ్చినటివంటి వై.సి.పి ప్రభుత్వం దానిని పక్కనపెట్టటమే కాకుండా గత అయిదు సంవత్సరాలలో బుడమేరు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడాకేటాయించకపోవటంచాలాదారుణమన్నారు.

ఈ పథకంలో వెలగలేరు దగ్గరనుంచి 36.00 కిలోమీటర్ ఎనికేపాడు మధ్యలో వున్న రెండు రైల్వే లైనుల కింద వున్న అండర్ టన్నెల్ వెడల్పు చేయటం,ఏలూరు కాలువ కింద వున్న అండర్ టన్నెల్ ను వెడల్పు చేయటం, అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వంలోప్రతిపాదించిన విధంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,555 క్యూసెక్కుల సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు.ఈకార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ ఛైర్మన్ బొర్రా అశోక్ కుమార్, జలవనరుల శాఖ ఇ.ఎన్.సి.ఎం.వెంకటేశ్వరరావు, ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన,కృష్ణా డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీరు బి.రాంబాబు,సూపరింటెండింగ్ ఇంజనీరు పి.గంగయ్య,ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుపి.వి.ఆర్.కృష్ణారావు,అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.దినేష్, గేట్ల మరమ్మత్తుల ప్రత్యేక అధికారి కె.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.