తోట్లవల్లూరు
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజు పాలెం గ్రామంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డి టి ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల. వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వరద బాధితుల పునరావాస కేంద్రంలో మొత్తం 239 మందికి పులిహోర పొట్లాలు అందించినారు.వరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడానికి సేవా దృక్పథంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని పునరావాస కేంద్రంలో లంక గ్రామమైన పిల్లి వానీ లంకకు చెందిన బాధితులు 170 మంది, ఎన్ డి ఆర్ ఎఫ్ 35 మంది, సహయ సిబ్బంది 24 మంది ఉన్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్ చార్జ్ కొడాలి. శ్రీనివాస్ (మువ్వ డి టి), గ్రామ సర్పంచ్ కొక్కిలిగడ్డ.హేమలత,పి.సత్యనారాయణ (పంచాయతీ సెక్రటరీ) స్థానిక కార్యకర్తలు రావెళ్ల.పండు,కొల్లూరు. నాగరాజు పాల్గొన్నారు.