Subscribe Us

header ads

జనవాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వినతుల వెల్లువ.


 జీలుగుమిల్లి:

ఏలూరుజిల్లా జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో బుధవారం ఉదయం ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు వినతుల అందించిన వారి సమస్యను సంబంధిత అధికారులకు ఆదేశించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.బాధితులు తెలిపిన సమస్యలు నమోదు చేసి, తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, లీగల్ సెల్ సభ్యులు,జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి,జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, విజయవాడ ఈస్ట్ కో ఆర్డినేటర్ రావిపాటి సౌజన్య,ప్రత్తిపాడు జనసేన ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు, కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషరావు,స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందరరామిరెడ్డి పాల్గొన్నారు.