భీమునిపట్నం:-
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వై..ఛీపి పాలనలో రాష్ట్రంలో ఒక్క చిన్న గట్టు కూడా కట్టలేదని అన్నారు. చెరువులను కబ్జా చేసిన చరిత్ర జగన్ సర్కార్ ది అని అన్నారు. చెరువులనే కాదు సముద్రాన్ని కూడా కబ్జా చేసిన అతిరధమహానుభావులని ఎద్దేవా చేసారు. విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి తీరంలో కట్టిన అక్రమ కట్టడం గురించి మాట్లాడాలని జగన్ రెడ్డికి సూచించారు. గత పదిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, వచ్చిన వరదల ప్రళయతాండవానికి విజయవాడ ప్రజలు అల్లాడిపోయారని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో ఎక్కడా రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపాధికన సహాయక చర్యల్లో మునిగితేలుతూ సేవలు అందిస్తే విమర్శించడానికి మీకు నోరెల వచ్చిందని అడిగారు. ముప్పై కి పైగా మంత్రులు, ఎమ్మెల్యే లు, 32 మంది ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, ఆర్మీ దళాలు, 3వేల మంది పారిశుధ్య కార్ముకులు, రెండువందలకు పైగా ఫైర్ ఇంజన్లు, వందల కొలదీ ట్రాక్టర్లు, స్వచ్చంద సంస్థలు, ఇలా ఎన్నో సంస్థలు అవిశ్రాంతంగా సేవలు అందించే పనిలో ఉంటే ఆదుకోవలసింది పోయి రాజకీయ విమర్శలు చేస్తారా..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అందరినీ జైల్లో వేస్తారని బెదిరించడం మీ నీచత్వ రాజకీయానికి నిదర్శనమని అన్నారు.
విజయవాడలో ఏదో కట్టేసామని పేక్ వీడియోలు పెట్టడమే మీ పనితీరా..? అని అన్నారు. అబద్దాలతో పుట్టి.. పేక్ లో పెరిగిన మీకు ప్రజల కష్టాలతో పనేముందని అన్నారు. ఎన్నికల తర్వాత బెంగళూరుకు మకాం మార్చారని అప్పుడప్పుడు జైల్లో ఉన్న మీ నాయకులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తుంటారని అన్నారు. కానీ ఇంత పెద్ద విపత్తులో రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతుంటే కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం మీ దురహంకారానికి ప్రతీక అని అన్నారు. ఇప్పటికైనా పనికిమాలిన రాజకీయాలకు స్వస్తి పలకాలని గంటా నూకరాజు హితవు పలికారు.