ఏలూరు,
ఏలూరుజిల్లా ఏలూరులో గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణ పాలనను అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అదేస్ఫూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు తాను కూడా శ్రీకారం చుట్టానని ఆయన వెల్లడించారు. ఏలూరు నియోజకవర్గంలోని వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇందులో భాగంగా ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఏలూరు కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ కుమార్, దారపు అనూష, కలవకొల్లు సాంబ, అర్జి సత్యవతి, జనపరెడ్డి కనక శ్రీ రాజేశ్వరిలు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాధరంగా పార్టీలోనికి ఆహ్వానించారు.