జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మంగళవారం జంగారెడ్డిగూడెం మండల ప్రత్యేకాధికారి,సబ్ కలెక్టర్ శ్రీ యం.ముక్కంటి ఆధ్వర్యములో స్థానిక తహసిల్దార్ వారి కార్యాలయములో మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశములో అన్ని శాఖల అధికారులకు ప్రస్తుత పరిస్థితులపై పలు సూచనలు ఇవ్వడం జరిగినది. వినాయకుని నిమజ్జనం కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎ.యన్.యం లు మరియు ఆశా వర్కర్స్ డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు జ్వరములు అంటువ్యాధులు రాకుండా చూడడం, పడిపోయే పరిస్థితిలో వున్న స్కూల్ లను వేరే బిల్డింగ్ లోకి మార్చవలసినదిగానూ, అంగన్ వాడి కేంద్రాలు పడిపోయే స్థితిలో వున్న బిల్డింగ్ లో పిల్లలను ఉంచరాదని, కరెంటు తీగలు రోడ్ పై పడకుండా, వర్షములు వచ్చినప్పుడు ప్రజలకు కరెంటు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవలసినదిగా గ్రామ రెవిన్యూ అధికారులు మరియు పంచాయితి సెక్రటరీలు గ్రామములలో అందుబాటులో వుంటూ వరదలు కారణముగా ఎటువంటి అనారోగ్యములు, ప్రమాదాలు జరుగకుండా శానిటేషన్ చేయవలెనని సూచనలు ఇచ్చియున్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్, కె.స్లీవ జోజి, యం.పి.డి.ఒ, కేవి.ప్రసాద్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.