ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామం నందు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం నాలుగోవ వార్షికోత్సవ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు,వైద్య సిబ్బందికి పండ్లను జిల్లా చైర్మన్ నంజం రామకృష్ణ ఆధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి పత్తిపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు కాసల కోనయ్య ఆదేశాలనుసారం అన్ని రాష్ట్రాలలో వార్షికోత్సవ వేడుకలను జరుపుతున్నట్లు తెలియజేశారు. ప్రతి వ్యక్తి తన యొక్క హక్కుల గురించి తెలుసుకోవాలని తమ హక్కులు గురించి అవగాహన ఉంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు మనకి ఉంటుందని కనుక
ప్రతి ఒక్కరికి ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం తరపున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దీనికై అనేక పోరాటాలు సైతం చేసి మన హక్కులను సాధించుకునే దాకా పోరాడదాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోస్తా ఆంధ్ర రీజనల్ లీగల్ అడ్వైజర్ రానీమేకల సత్యనారాయణ,రీజనల్ మీడియా చైర్మెన్ ఎస్ ఎస్ బాబు,జిల్లాసలహాదారుడు ముసునూరి సతీష్ కుమార్,జిల్లా కార్యదర్శి పలగాని వెంకట కోటేశ్వరరావు,జిల్లా ఎంప్లాయిస్ వింగ్ చైర్మన్ తాడిశెట్టి నారాయణ,జిల్లా బీసీ సెల్ చైర్మన్ మొగసాటి శివశంకర్ రాజు పాల్గొన్నారు.