Subscribe Us

header ads

విపత్తుల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం


ఆగిరిపల్లి:-

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామం నందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐదు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నకు వివిధ రాష్ట్రాలలోని పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్,రెడ్ క్రాస్,నెహ్రూ యువ కేంద్రం ల నుండి 35 మంది హాజరయ్యారు.ఆగిరిపల్లి మండలం నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మక్కే వేణుగోపాలరావు,అంకం వెంకటేశ్వరరావు డేవిడ్ రాజులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ లుగా మహమ్మద్ ఆసిఫ్, డాక్టర్ బాలు, డాక్టర్ కుమార్ రఖా, రంజన్ కుమార్ లు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో వారు ప్రకృతి వైపరీత్యాలకు మానవులు స్పందించే విధానం,తమను తాము రక్షించుకునే విధానం, విపత్తు సంభవించే ముందు ప్రమాదాన్ని తగ్గించే మార్గాలను కనుగొనడం ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది అనే అంశాలను సుదీర్ఘంగా వివరించారు.ఉపశమనం, సంసిద్ధత,ప్రతిస్పందన, మరియు పునరుద్ధరణ అనే అంశాలను అవగాహన కార్యక్రమం నిర్వహించారు.