గోకవరం:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోకవరం సంత మార్కెట్లో నివాసము ఉంటున్న బూరా అప్పల నరసమ్మ అనే వృద్ధురాలు ఇల్లు పూర్తిగా పడిపోవడంతో వాళ్లు పరిస్థితిని చూసి చలించిన మండల పరిషత్ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి వీరబాబు తన వంతు సహాయంగా 2000/- రూపాయలును గోకవరం దళిత నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ సి సెల్ కార్యదర్శి వరసాల ప్రసాద్ ల చేతుల మీదుగా అప్పల నరసమ్మ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అప్పల నరసమ్మ కు ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకునేలా ప్రయత్నం చేస్తానని ధైర్యంగా ఉండమని ఆమెకు భరోసా ఇచ్చారు. వీరి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్రి శివ రామకృష్ణ,గెంజి విజయ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కరాసు శివరామకృష్ణ,బత్తిన రామకృష్ణ,అల్లాడి సింహాచలం,రవి,ఉంగరాల ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు.