ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వృక్ష శాస్త్రము మరియు హార్టికల్చర్ విభాగాల నుండి కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు అధ్యక్షతన పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీ మరియు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లేకపోవడం వల్ల అకాల వర్షాలు, అత్యధిక ఎండలు వస్తున్నాయని అందువల్ల పర్యావరణాన్ని రక్షించే విధంగా వినాయక విగ్రహాలలో విత్తనాలను పెట్టి ఇస్తున్నామని తరువాత వాటిని ఇంటి పెరట్లో నిమజ్జనం చేయటం వల్ల మొక్కలు వస్తాయని వాటిని పెంచి పోషించే బాధ్యత కూడా మీదేనని భవిష్యత్తులో మట్టి వినాయకుల ప్రతిమలే వాడాలని దానివల్ల కొంతవరకు పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు చెట్లు పెంచడం వల్ల భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు కారణం అవుతామని అన్నారు.
ఐ. క్యూ. ఏ. సి.కోఆర్డినేటర్ డా. ఎమ్.మధు మాట్లాడుతూ మన కళాశాలలో వెహికల్ ఫ్రీ డే ని, ప్లాస్టిక్ రహిత క్యాంపస్ ని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చాలా వరకు చేపడుతున్నామని గత సంవత్సరాలలో కూడా పర్యావరణహిత వినాయక విగ్రహాలు తయారు చేయడం జరిగిందని ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా విత్తనాలతో కూడిన వినాయకుని తయారు చేయడం మంచి కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు.
వృక్ష శాస్త్ర అధిపతి టి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ బోటనీ విభాగం నుంచి పర్యావరణహిత వినాయకుని తయారు చేయడం అదేవిధంగా అధ్యాపకులకు విద్యార్థులకు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని పర్యావరణ సంరక్షణలో మేము కూడా భాగస్వాములమయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు, హార్టికల్చర్ విభాగ అధిపతి, జంతు శాస్త్ర విభాగాధిపతి ఆర్.విజయ దీపిక సిహెచ్. వెంకటలక్ష్మి, కామర్స్ విభాగ అధిపతి డా. కే. ఉత్తమ్ సాగర్ కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ సిహెచ్. రమాదేవి, గణిత శాస్త్ర విభాగ అధిపతి రసాయన శాస్త్ర విభాగ అధిపతి యు. వెంకటాచార్యులు, సిహెచ్.బదరీ నారాయణ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.