వేలేరుపాడు:-
ఏలూరుజిల్లా వేలేరుపాడు మండలం వరద ప్రభావిత ప్రాంతాలు,ముత్యాలంపాడు,రేపాకగోమ్ము,రుద్రమ్మకోట,పంచాయతీలను నేడు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రీ బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బియ్యం,కందిపప్పు,పంచదార, పామయిల్,ఉల్లిపాయ,బంగాళాదుంపలు ఇవి కాక అదనంగా టమాటాలు పచ్చిమిర్చి, దొండ, బెండ, వంకాయ, బీరకాయలు కూరగాయలు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముంపు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అద్దయ్య,ఎమ్మార్వో చెల్లన్న దొర, సత్యనారాయణ, పి డి ద్వామ రాము, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్,జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ,మండల అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ, మండల వైస్ ప్రెసిడెంట్ మెచినేని సంజయ్, సుధాకర్, శంకరం కూటమి నాయకులు పాల్గొన్నారు.