Subscribe Us

header ads

వరద నష్టం నమోదుకు ప్రత్యేక యాప్.


  ఏలూరు:-

పంట నష్టాల వివరాల నమోదును పరిశీలించిన ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి... ఏలూరుజిల్లా వరద నష్టాలకు సంబంధించి సమాచారాన్ని రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఏలూరు డివిజన్ లోని తహశీల్దార్లను రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్ కె ఖాజావలి ఆదేశించారు. గురువారం పెదపాడు మండలం అప్పనవీడు సచివాలయంలో పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను ఆర్డిఓ ఖాజావలి పరిశీలించారు.  

ఈ సందర్బంగా పంట నష్టం, పశు నష్టం, ఇళ్ల నష్టం, తదితర వాటిపై ఆరా తీశారు. వరదల వల్ల పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం రూపొందించిందన్నారు. వరద మూలంగా జరిగిన నష్టాలు, వరద బాధిత ప్రజల డేటాకు సంబందించిన అన్ని వివరాలు యాప్ లో నమోదు చేయబడ్డాయన్నారు. వీరి వెంట తహశీల్దారు డి. ప్రసాద్, తదితరులు ఉన్నారు.