చాట్రాయి:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తాపూరు గ్రామంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి గాయత్రీ దేవి ఆధ్వర్యంలో తూర్పు ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసో త్సవ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా చిరుధాన్యాలు వాడకం గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం ఏడు నెలల నుండి రెండు సంవత్సరాల పసిపిల్లలకు ఇచ్చే ఆహారం గురించి తల్లులకు అవగాహన మరియు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటం జరిగింది. అనంతరం తల్లి పేరు మీద బిడ్డ పేరు మీద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏఎన్ఎం బి సామ్రా జ్యం అంగన్వాడి కార్య కర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.