ఏలూరు:-
కేసులలో సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం: జిల్లా ఎస్పీ. ఏలూరుజిల్లా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు మరియు ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, కేసుల పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గమని కక్షిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వివిధ సందర్భలలో పరస్పరం కేసులు పెట్టుకున్న ఇరు వర్గాల వారు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి ధనం మరియు సమయాన్ని వృథా అవ్వకుండా పరస్పర అంగీకారంతో రాజీ చేసుకునే అవకాశం జాతీయ లోక్ అదాలత్ ద్వారా కల్పించ బడి ఉందని, కావున కక్షి దారులు ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఎస్పీ తెలియజేశారు.